హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ (అడ్మిన్)గా ఉన్న సత్యనారాయణను చార్మినార్ జోనల్ కమిషనర్గా, ముసారాంబాగ్ డిప్యూటీ కమిషనర్(డీసీ)గా ఉన్న భాస్కర్ రెడ్డిని సంతోష్ నగర్ సర్కిల్ డీసీగా, జంగంమెట్ డిప్యూటీ కమిషనర్ పాపయ్యను చాంద్రాయణగుట్ట సర్కిల్ డీసీగా , డిప్యూటీ కమిషనర్ (ఎలక్షన్స్)గా ఉన్న విజయలక్ష్మిని ఎస్టేట్స్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు.

